Advertisement

శుక్రవారం పూట మహాలక్ష్మీని భక్తి, శ్రద్ధలతో పూజించాలి

By: chandrasekar Fri, 29 May 2020 7:21 PM

శుక్రవారం పూట మహాలక్ష్మీని భక్తి, శ్రద్ధలతో పూజించాలి


శుక్రవారం పూట మహాలక్ష్మీని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. లక్ష్మీ కటాక్షం కోసం సంపద, సంతోషాలతో పాటు ఆయురారోగ్య ఐశ్వార్యాలతో తులతూగుతుంటారు. డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా అనుకున్న విధంగా సంపద సమకూరదు. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం సాయంత్రం వేళల్లో కొన్ని పూజలు చేయాలి. ఫలితంగా లక్ష్మీ దేవి కటాక్షం పొంది సంపద, సంతోషాలు అందుబాటులోకి వస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఎలాంటి పరిష్కార మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

mahalakshmi,should,worshiped,devotion,diligence ,శుక్రవారం, పూట, మహాలక్ష్మీని, భక్తి, శ్రద్ధలతో పూజించాలి


జ్యోతిష శాస్త్రం ప్రకారం ఐశ్వర్యాభివృద్ధి కోసం అష్ట లక్ష్మీ క్రమం తప్పకుండా పూజించాలి. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అష్టలక్ష్మీ భక్తి, నిష్ఠలతో ప్రార్థించాలి. అయితే ఈ పూజ కోసం నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే సరైన ఫలితం కనిపిస్తుంది. అంతేకాకుండా జీవితంలో డబ్బు కొరత కనిపించదు. ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వార్యాభివృద్ధిని కలిగి ఉంటారు.

గులాబి రంగు దుస్తులను ధరించి మహాలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ సమయంలో గులాబి రంగు దస్తులు తప్పనిసరి. లేకపోతే పూజఫలం సమకూరదు. మహా లక్ష్మీ విగ్రహానికీ గులాబి రంగు దుస్తులను ధరింప జేయాలి. విగ్రహంతో పాటు శ్రీయంత్రం తప్పనిసరిగా ఉంచాలి. ఆవు నెయ్యితో 8 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని కొలవాలి. దీని తరువాత, గులాబీ సువాసన ధూపం వెలిగించాలి. పూజాసమయంలో మహాలక్ష్మీ విగ్రహం, శ్రీయంత్రానికి అష్టగంధాన్ని తిలకంగా తీర్చిదిద్దాలి. అనంతరం ఈ మంత్రాన్ని జపించాలి. మమహ గృహే అగచ్ఛగచ్ఛా నమః స్వాహా అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు పఠించాలి.

mahalakshmi,should,worshiped,devotion,diligence ,శుక్రవారం, పూట, మహాలక్ష్మీని, భక్తి, శ్రద్ధలతో పూజించాలి


ఇంటిలో 8 దీపాలను వెలిగించి ఇంటి వైపున్న 8 దిశల్లో ఉంచాలి. దీని తరువాత డబ్బు ఎక్కడ ఉంచినా జపించడానికి ఉపయోగించే తామర ఆకు దండను ఉంచండి. అదే సమయంలో, పూజ సమయంలో చేసిన తప్పుకు క్షమించాలని అష్ట లక్ష్మిని ప్రార్థించండి. భక్తి శ్రద్ధలతో దేవతను పూజించి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె తన దయను మీపై ఎల్లప్పుడూ ఉంచుతుంది. ఆనందం, శ్రేయస్సు, సంపదను పెంచుతుంది.

Tags :
|

Advertisement