Advertisement

బీదవాడు, గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?

By: chandrasekar Thu, 16 July 2020 5:08 PM

బీదవాడు, గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?


ఒకరోజు సభలో బీర్బల్‌ను అక్బర్‌ చక్రవర్తి ఈ విధంగా ప్రశ్నించాడు. ‘ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు, గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?’ ‘సాధ్యమవుతుంది ప్రభూ’ అని బదులిచ్చాడు బీర్బల్‌.

‘అలాగా! అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా?’ అన్నాడు అక్బర్‌. ‘తప్పకుండా చూపిస్తాను ప్రభూ’ అని బీర్బల్‌ సభ నుండి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు.

‘ఇతను కడు బీదవాడు ప్రభూ! బిచ్చ మెత్తుకుని జీవిస్తాడు’ అని బీర్బల్‌ ఆ వ్యక్తిని అక్బరు ముందు నిలబెడుతూ చెప్పాడు. ‘ఆ విషయం చూస్తేనే అర్థం అవుతున్నది. మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు?’ ఆసక్తిగా అడిగాడు అక్బరు.

అప్పుడు బీర్బల్‌ స్పందిస్తూ ‘ఇతను బిచ్చగాడు అయినప్పటికీ, మన రాజదర్భారులో ఒకసారి సన్మానం చేయండి. ప్రజల ముందు ఆ సత్కారం అందితే అతనికి గౌరవం పెరుగుతుంది. అప్పుడు బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు’ అన్నాడు బీర్బల్‌. బీర్బల్ చాతుర్యానికి అక్బర్‌ చక్రవర్తి ఎంతో ఆనందించాడు.

Tags :
|
|

Advertisement