Advertisement

వెండి వస్తువులను ధరించడం వలన కలిగే లాభాలు ..

By: Sankar Sun, 12 July 2020 4:59 PM

వెండి వస్తువులను ధరించడం వలన కలిగే లాభాలు ..



మన దేశంలో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇస్తారు ..అయితే బంగారంతో పాటు వెండి కూడా ఉపయోగిస్తారు ..బంగారంతో పోలిస్తే వెండి ధర కూడా తక్కువే ..ఇది మాత్రమే కాకుండా వెండి ధరించడం వలన అనేక లాభాలు కూడా ఉన్నాయి ..

వెండిని ఆభరణంగా ధరించడం ఎంతో శుభపరిణామంగా భావించాలి. ముఖ్యంగా వేళ్లలో చిన్న వేలుకు వెండితో చేసిన ఉంగరాన్ని ధరస్తే ఎంతో మంచిది. దీని కారణంగా మానసికంగా బలహీనంగా ఉండే వ్యక్తులు ఊరట పొందుతారు. వెండితో తయారు చేసిన గొలుసు మెడలో ధరిస్తే మీరు మంచి వక్తలుగా పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో హార్మోన్ల సమతూల్యం కావడం ప్రారంభిస్తాయి. ఇది అనేక వ్యాధుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

స్వచ్ఛమైన వెండికి చెందిన పెద్ద ముక్కను ఆభరణంగా ధరిస్తే మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి కాకుండా వాతం, పిత్తాశయానికి చెందిన సమస్యలు, దగ్గు లాంటివి నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తులు అంత త్వరగా అనారోగ్యానికి గురికారు. వెండి గ్లాసు లేదా గిన్నెలో నీరు తాగితే జలుబుతో పాటు శీతల సమస్యలు రాకుండా ఉంటాయి. స్వచ్ఛమైన తేనేను వెండి గిన్నే లేదా చెంచాతో తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండి అనేది చంద్రుడు, శుక్ర గ్రహాలకు సంబంధించినది. వెండి పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి పుట్టిందని నమ్ముతారు. పండితుల అభిప్రాయం ప్రకారం సోమవారం రోజు వెండితో పాటు పాలు, పెరగు, నెయ్యి, తేనే, చక్కెరతో చేసిన శంకరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేస్తే శరీరంలోని అన్ని వ్యాధులు తొలుగుతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలిగి సాంత్వన పొందుతారు.

Tags :
|
|
|

Advertisement