Advertisement

ధన సమృద్ధికి వాస్తు చిట్కాలు

By: chandrasekar Thu, 11 June 2020 7:44 PM

ధన సమృద్ధికి వాస్తు చిట్కాలు


ధనం సమృద్ధిగా ఉంటె సహజంగానే అన్ని సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠలు మన చెంతకు వస్తాయి. మీరు కనుక నూతన గృహ నిర్మాణం చేపడుతున్నట్లయితే కొన్ని సూచనలు పాటించి ధన ప్రవాహాన్ని ఆకర్షించవచ్చు.

భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగడానికి ఉపకరిస్తాయి. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం ఉంటుంది. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. ఇంటిని మనం నిర్మించుకుంటే అది వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంట్లోకి వెళ్తే వాస్తుకు అనుగుణంగా దాన్ని పూర్తిగా మార్చలేం. కానీ కొన్ని టిప్స్‌తో వాస్తుదోషాలను నివారించొచ్చని ప్రముఖ వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంటిని మనం నిర్మించుకుంటే వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అప్పటికే నిర్మించిన ఇంట్లోకి వెళ్తే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.

* మీరు ధనాన్ని భద్రపరిచే బీరువా లేదా లాకర్ను ఎప్పుడు ఇంటికి నైరుతి మూలన ఉండేట్టు చూసుకోండి. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఈయన సకల సంపత్ప్రదాత. దక్షిణ దిక్కుగా లేదా నైరుతి మూలన పెట్టిన బీరువా లేదా లాకర్ ఉత్తర దిక్కుగా తెరచుకుంటుంది, కనుక ఎప్పుడు అటువైపే పెట్టాలి.

* ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. దీన్ని అధిగమించడానికి వినాయకుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచండి.

* ఇంట్లోని వాస్తు దోషాలను అధిగమించడానికి వ్యూహాత్మక స్థానాల్లో పిరమిడ్లను ఉంచడం ఉపకరిస్తుంది. ఇంటి మధ్యలో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో లేదంటే శక్తిపరంగా ముఖ్యమైన స్థానంలో పిరమిడ్లను ఏర్పాటు చేయాలి.

* ఇంట్లో బోరింగ్/బావి తప్పుడు దిశలో ఉంటే బోరింగ్‌కు నైరుతి దిశలో పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఉంచండి.

* ధ్యానం చేసుకోవడానికి ఈశాన్యం సరైన దిశ. ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈశాన్యంలో ధ్యానం చేయడం ఉపకరిస్తుంది.

* ఈశాన్యం దిశలో పొడవైన రోడ్డు మార్గం ఉన్నటువంటి సీనరీని ఉంచండి.

architectural,tips,for richness,house,money ,ధన, సమృద్ధికి, వాస్తు, చిట్కాలు, సౌకర్యాలు


* పసుపు లేదా బంగారు వర్ణంలోని ఫ్రేమ్‌తో ఉన్న ఫ్యామిలీ ఫొటోను నైరుతి దిశలో ఉంచండి. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. లేదంటే పొద్దుతిరుగుడు పువ్వు ఫొటో లేదా పెయింటింగ్‌ను ఉంచండి.

* తూర్పు దిశ ఉదయిస్తోన్న సూర్యుడి పెయింటింగ్ లేదా ఫొటో ఉంచడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగవుతాయి.

* పిల్లల స్టడీ టేబుల్‌ను తూర్పు దిశలో ఉంచితే చదువులో మెరగువుతారు.

* ఇంట్లో తలుపులు, కిటికీలో సరి సంఖ్యలో ఉండేలా చూసుకోండి.

* వేగంగా పరిగెడుతోన్న ఎర్రటి వర్ణంలోని గుర్రాల ఫొటో లేదా విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుంది. సామరస్యం పెరుగుతుంది.

* వైవాహిక బంధం బలంగా ఉండటానికి బెడ్ మీద ఒకే మ్యాట్రెస్‌ను ఉంచండి. భర్తకు భార్య ఎడమ వైపే నిద్రించాలి.

* అవసరం లేని వస్తువులను తీసేయండి. బెడ్రూంను పూర్తి చీకటిగా ఉంచొద్దు. వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అలాగే పడకగది గోడలపై డార్క్ కలర్స్ వేయొద్దు.

* బాత్రూంలో సహజమైన మొక్కలు లేదా క్యాండిల్స్ ఉంచాలి. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

* కుటుంబ అనుబంధాన్ని వంటగది ఎంతో ప్రభావితం చేస్తుంది. కిచెన్‌లో గ్యాస్, సింక్ మధ్య సాధ్యమైనంత ఎక్కువ దూరం ఉండాలి.

* సంబంధాలు బలోపేతం కావడం కోసం బెడ్రూంను నైరుతి దిశలో ఉంచాలి.

* మూలల వైపు పడుకోవడం మానేయాలి. మూలల్లో నిద్రించడం వల్ల నరాల వ్యవస్థపై ఒత్తిడిని పెరుగుతుంది.

* ఈశాన్య దిశలో చేపల ఆక్వేరియం ఉంచాలి. ఇలా చేయడం వల్ల పురోగతి ఉండటంతోపాటు నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

* ఈశాన్యం దిశలో వాటర్ ఫౌంటెన్ ఉంచుకోవడం మంచిది.

* తూర్పు దిశలో ఆకుపచ్చని మొక్కల్ని పెంచడం వల్ల సంబంధాలు మెరుగవుతాయి.

Tags :
|
|

Advertisement